బురిడి బాబా అరెస్ట్‌.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..!

బురిడి బాబా అరెస్ట్‌.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు..!
నల్లగొండ జిల్లాలో బురిడి బాబా గుట్టు రట్టు కాగా.. పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి.

నల్లగొండ జిల్లాలో బురిడి బాబా గుట్టు రట్టు కాగా.. పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. సూపర్‌ ఎనర్జీ పేరుతో మహిళలను విశ్వ చైతన్య మోసం చేశాడని పోలీసులు తెలిపారు. ట్రస్ట్‌ పై దాడి చేసిన పోలీసులు 26 లక్షల నగదు.. కోటిన్నర రూపాయల విలువైన భూమి పత్రాలు, రెండో భార్య పేరు మీద ఉన్న కోటిన్నరకు పైగా ఉన్న ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రకరకాల ఇబ్బందులతో తన దగ్గరకు వచ్చే వారికి మాయ మాటలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నమ్మితే సొమ్ము.. నమ్మకుంటే దమ్ము అటూ ప్రచారం చేశారని పేర్కొన్నారు. ప్రజల వీక్‌నెస్‌ని పెట్టుబడిగా మార్చి అక్రమాలకు పాల్పడుతున్న దొంగ బాబా విశ్వ చైతన్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఐజీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story