Fake Passport : ఐశ్వర్యారాయ్ పేరిట ఫేక్ పాస్‌పోర్ట్.. భారీ కుట్రకు అవకాశం!
గ్రేటర్ నోయిడా

Bollywood: అందాల తార ఐశ్వర్యారాయ్ వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుపోయే రకమని అందరికీ తెలిసిందే. కానీ, ఉన్నట్లుండి ఐష్ పేరు క్రైమ్ కార్నర్ లో దర్శనమిచ్చేసరికి ఒక్కసారిగా బాలీవుడ్ లో పెద్ద దుమారమే లేచింది. ప్రపంచ సుందరిగా పేరుగాంచిన ఐష్ పేరిట ఫేక్ పాస్ పోర్ట్ బయటపడటం చర్చనీయాశంగా మారింది.
ఈ మేరకు గ్రేటర్ నోయిడాలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా గతంలోనూ ఎన్నో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. మాట్రిమోనియల్ సైట్స్, డేటింగ్ యాప్ ల ద్వారా సుమారు రూ. 1.80లను స్వాహా చేశారట. ఓ రిటైర్డ్ కల్నల్ సైతం ఈ ముఠాలో భాగస్వామి అని పోలీసులు గుర్తించారు.
ఫేక్ పాస్ పోర్ట్ పై ఐశ్వర్యారాయ్ ఫొటోతో పాటూ ఆమె ఊరు పేరు గుజరాత్ లోని భావ్ నగర్ అని పేర్కొని ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ 18, 1990 అని ఉంది. విచారణలో భాగంగా పోలీసులు సదరు ముఠా నుంచి రూ.11కోట్లు విలువగల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముఠా ఉపయోగిస్తున్న ఇతర సాంకేతిక ఎక్విప్ మెంట్ ను సైతం పోలీసులు స్వాధీన పరచుకున్నారు.
వివిధ కంపెనీలకు సలహాదారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గురించి సమాచారం అందుకున్న పోలీసులు, విచారణ జరుపగా ఈ ఫేక్ పాస్ పోర్ట్ కుంభకోణం బట్టబయలు అయింది. ప్రస్తుతం సెలబ్రిటీల ఫేక్ పాస్ పోర్ట్ లతో ఈ ముఠా ఏం చేయబోతోంది అనే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com