దారుణం.. సంవత్సరం వయస్సున్న కొడుకుతో సహా ఆత్మహత్యచేసుకున్న దంపతులు

దారుణం.. సంవత్సరం వయస్సున్న కొడుకుతో సహా ఆత్మహత్యచేసుకున్న దంపతులు
X

పశ్చిమ గోదావరిజిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో దారుణం జరిగింది. సంవత్సరం వయస్సున్న కొడుకుతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన పరుషురాం, సావిత్రిగా గుర్తించారు. హైమావతి అనే మహిళలకు దంపతులు 46 లక్షలు అప్పు ఇచ్చారు. ఈ మధ్య హైమావతి డబ్బుతో పరార్ కావడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దంపతులు ఆత్మహత్యతో ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.


Tags

Next Story