Karnataka : ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Karnataka : ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని మరియమ్మనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో జరగగా, దంపతులు, ఇద్దరు పిల్లలతో సహా నలుగురు మృతి చెందారు.
ఏసీ వెంట్ నుంచి గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. మంటల్లో ఇల్లు క్షణాల్లో దగ్ధమైంది. మృతులను వెంకట్ ప్రశాంత్ (42), అతని భార్య డి. చంద్రకళ (38), వారి కుమారుడు అద్విక్ (6), కుమార్తె ప్రేరణ (8)గా గుర్తించారు.
దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా అనే అంశంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కుటుంబానికి ఏమైనా అప్పులు ఉన్నాయా, ఒత్తిడికి గురయ్యారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com