ఏం కష్టమో.. ఒకేసారి ముగ్గురూ..

ఏం కష్టమో.. ఒకేసారి ముగ్గురూ..
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని నిండు జీవితాలకు ముగింపు పలికారు.

ఆర్థిక బాధలో, అప్పుల బాధలో.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని నిండు జీవితాలకు ముగింపు పలికారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడంతో ఎర్రుగుంట్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రామకృష్ణ (43), అతని భార్య రాజేశ్వరి (38), కుమారుడు దేవేంద్ర (14) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story