Yadadri Bhuvanagiri District: లంచం కోసం రైతుపై దాడి చేసిన ఉద్యోగి..

Yadadri Bhuvanagiri District: యాద్రాద్రి భువనగిరి జిల్లాలో అడిగిన లంచం ఇవ్వనందుకు రైతుపై దాడి చేశాడు ఓ లైన్మన్. బొడ్డుగూడెం గ్రామనికి చెందిన రైతు మల్లయ్య విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం 60 వేల డిడి తీసి దరఖాస్తు పెట్టుకున్నాడు. దీంతో స్థానిక లైన్మెన్ వెంకన్న.. సదరు రైతు వ్యవసాయ బావి వద్ద కొత్త ట్రాన్స్ ఫార్మర్‌కి బదులు.. పాత ట్రాన్స్‌ఫార్మర్ అమర్చాడు. ఇందుకోసం సదరు రైతు.. లైన్‌మెన్ కు 6 వేల డబ్బుతో పాటు మందు, రెండు కోళ్లు లంచంగా ఇచ్చాడు.
మల్లయ్య వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్‌ఫార్మర్ అమర్చి ఏడాది కావొస్తున్న సర్వీస్ నెంబర్ మాత్రం ఇవ్వలేదు. ఈనేపథ్యంలో కరెంట్ బిల్లు కట్టడానికి సర్వీస్ నెంబర్, బిల్లు రశీదు ఇవ్వాలని మల్లయ్య.. లైన్‌మెన్‌నూ నిలదీశాడు.
దీంతో ఆగ్రహించిన వెంకన్న.. రైతు వ్యవసాయ బావి వద్దకు వచ్చి మోటార్ స్టార్టర్ ప్యూజ్, ట్రాన్స్‌ఫార్మర్ ప్యూజ్ పీకేశాడు. అడ్డుకున్న రైతు మల్లయ్యను చెప్పుతో కొట్టి పక్కనే ఉన్న కందిచేనులో పడేశాడు. తనపై దాడి విషయాన్ని మల్లయ్య ఏఈ హుస్సేన్ దృష్టికి తీసుకొచ్చాడు. లైన్‌మెన్ వెంకన్నతోపాటు అతని అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని మల్లయ్య ఏఈకి విజ్ఙప్తి చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com