Farzi : రోడ్లపై నోట్ల వర్షం... సినిమాలో చేసినట్లు చేశారు, అరెస్ట్ అయ్యారు

Farzi : రోడ్లపై నోట్ల వర్షం... సినిమాలో చేసినట్లు చేశారు, అరెస్ట్ అయ్యారు
ఒకరు కారు నడిపిస్తుండగా, మరొకరు కారు డిక్కీలో కూర్చుని నోట్లను రోడ్లపై విసిరారు

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'లో కారులో వెళ్తూ నకిళీ నోట్లను రోడ్లపై విసురుతారు. మంగళవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు హర్యానాలోని గురుగ్రామ్ రోడ్డుపై కారులో వెళ్తూ నోట్లను రోడ్లపై విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తెల్లటి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో, ఒకరు కారు నడిపిస్తుండగా, మరొకరు కారు డిక్కీలో కూర్చుని నోట్లను రోడ్లపై విసిరారు. కరెన్సీ నోట్లను విసిరిన వ్యక్తి, తన ముఖాన్ని సగానికిపైగా బట్టతో కవర్ చేసుకున్నాడు.


నోట్లను రోడ్లపై విసిరిన వ్యక్తులు సదరు వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎల్ఎఫ్ గురుగ్రామ్ ఏసీపీ వికాస్ కౌశిక్ మీడియాకు తెలిపారు. విసిరిన నోట్లు నకిలీవో, అసలువో ఇంకా తెలియరాలేదు.


Tags

Read MoreRead Less
Next Story