రాజ్ తరుణ్ కోసం ఆమరణ నిరాహార దీక్షట
యూ ట్యూబ్ నుంచి వెండితెరకు వచ్చి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్( Raj Tharun ). బట్ సక్సెస్ ను కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూశాడు. దీంతో ఇక అతని పని అయిపోయింది అనుకున్నారు. బట్ అనూహ్యంగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వరుస మూవీస్ తో రెడీగా ఉన్నాడు. ఈ టైమ్ లో తను గతంలో ప్రేమించాను అని చెబుతున్న లావణ్యతో కొత్త తలనొప్పులు మొదలయ్యయి. కొన్ని నెలల క్రితం లావణ్య డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ అయింది. దీంతో ఆమె రాజ్ తరుణ్ లవర్ కాబట్టి ఇతనూ డ్రగ్స్ తీసుకున్నాడేమో అనుకున్నారు. కాకపోతే అతనికి మరకలు అంటలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత తను రాజ్ తరుణ్ కోసం పట్టుబడుతోంది. అతను మరో హీరోయిన్ తో తిరుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనీ.. గతంలోనే మేము పెళ్లి చేసుకున్నాం అనీ.. ఓ సారి అబార్షన్ కూడా చేయించాడని రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తోంది. వీటన్నటినీ రాజ్ తరుణ్ తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మరోవైపు అతను నటించిన ‘తిరగబడర సామీ’, ‘భలే ఉన్నాడే’ అనే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో అతను ప్రమోషన్ కోసం ఇదంతా చేస్తున్నాడు అనే అనుమానాలూ వచ్చినా.. వ్యవహారం కేస్ ల వరకూ వెళ్లింది కాబట్టి.. నిజమే అని తేలింది.
ఇక తాజాగా రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య అతని కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తా అని ప్రకటించడం సంచలనంగా మారింది. ఏదేమైనా ఇలాంటి వ్యవహారాలను తెగే వరకూ లాగొద్దు. ఇద్దరికీ దగ్గరైన వారి సమక్షంలో ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని ప్రాబ్లమ్ క్లియర్ చేసుకుంటే బెటర్ తప్ప.. ఇలా రోడ్లపైకి వస్తూ ఉంటే కొన్నాళ్ల తర్వాత జనం కూడా పట్టించుకోవడం మానేస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com