తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. కూతుర్ని కాపాడి మృత్యువాతపడ్డ తండ్రి..!

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. కూతుర్ని కాపాడి మృత్యువాతపడ్డ తండ్రి..!
తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాలువలో పడ్డ కన్నకూతుర్ని కాపాడి తండ్రి మృత్యువాత పడ్డాడు.

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాలువలో పడ్డ కన్నకూతుర్ని కాపాడి తండ్రి మృత్యువాత పడ్డాడు. కూతురు విమల కాలేజికి వెళ్లలేదని తండ్రి జయబాబు మందలించాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన యువతి సమీపంలో ఉన్న పోలవరం కాలువలో దూకింది. కూతుర్ని రక్షించేందుకు జయబాబు కాలువలో దూకి ఆమెను ఒడ్డుకు చేర్చి..నీటిలో మునిగిపోయాడు. ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టి జయబాబు డెడ్ బాడీని బయటకు తీశారు. కూతుర్ని ఆస్పత్రికితరలించి చికిత్స అందిస్తున్నారు. జయబాబు అకాల మరణంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story