Anantapuram : మరో పరువు హత్య.. కూతుర్ని దారుణంగా..

X
By - Sai Gnan |10 Sept 2022 3:45 PM IST
Anantapuram : తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లిలో దారుణం జరిగింది
Anantapuram : తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లిలో దారుణం జరిగింది. వేరే కులం వాడిని ప్రేమించిందని కూతుర్ని రోకలిబండతో కొట్టి చంపాడు తండ్రి. దీంతో యువతి అక్కడికక్కడే చనిపోయింది. స్వాతికి 16ఏళ్లు... ఇంటర్ ఫెయిల్ అవడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈమధ్యే ఇంటిదగ్గర్లో ఉన్న ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తండ్రికి తెలియడంతో పలుమార్లు మందలించాడు. ఇదే విషయమై గొడవలు కూడా జరిగాయి. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆగ్రహానికి గురైన యువతి తండ్రి... రోకలి బండతో ఆమెపై దాడి చేశాడు. దీంతో యువతి స్పాట్‌లోనే చనిపోయింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com