Crime News: కూతురిపై తండ్రి లైంగిక దాడి.. చచ్చే వరకు జైల్లోనే చావమంటూ తండ్రికి కోర్టు తీర్పు

Crime News: ఆడవాళ్లను చూస్తే చాలు చొంగలు కారుస్తున్నారు.. తల్లికి, చెల్లికి, కూతురికి, కోడలికి తేడా తెలియకుండా పోతోంది.. మాయదారి మనసు విచక్షణ కోల్పోతోంది. శిక్షణలు కఠినం చేస్తేనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి వెనుకాడతారు.. భాగ్యనగరం నడిబొడ్డున చోటు చేసుకున్న ఘటనకు కోర్టు తగిన శిక్ష విధించింది. కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి మరణించే వరకు జైల్లోనే మగ్గమని కోర్టు తీర్చు ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో నివసిస్తోంది. భర్త వాచ్‌మెన్‌గా, భార్య నాలుగిళ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి 14 ఏళ్ల కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు.
కొడుకు సొంత ఊరిలో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు.. కూతురు తల్లిదండ్రులతో పాటు ఉంటోంది. ఓ రోజు ఉన్నట్టుండి కూతురు వాంతులు చేసుకోవడంతో తల్లి ఆందోళనతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అమ్మాయి 4 నెలల గర్భిణీ అని చెప్పారు. నిశ్చేష్టురాలైన తల్లి కూతురిని నిలదీసింది. తనపై తండ్రి లైంగిక దాడికి పాల్పడేవాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని తల్లికి వివరించింది. తన దుర్మార్గపు చర్యలు బయటకు పొక్కడంతో బతకనివ్వరని తెలిసి తండ్రి పరారయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని వెతికి పట్టుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. విచారించిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి అనిత నిందితుడు మరణించే వరకు కారాగార జైలు శిక్షతో పాటు, రూ.5వేల జరిమానా విధించారు. మెట్రో లీగల్ సర్వీస్ అథార్టీ ద్వారా బాధితురాలికి రూ.7 లక్షలు సాయం అందించాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com