Finger Print Scam : ఆపరేషన్‌తో ఫింగర్ ప్రింట్లు మార్చుకొని స్మగ్లింగ్..

Finger Print Scam : ఆపరేషన్‌తో ఫింగర్ ప్రింట్లు మార్చుకొని స్మగ్లింగ్..
Finger Print Scam : హైదరాబాద్‌లో బట్టబయలైన ఫింగర్ ప్రింట్ స్కామ్‌ ముఠా గుట్టును రట్టు చేశారు ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి ఎస్ఓటీ పోలీసులు.

Finger Print Scam : హైదరాబాద్‌లో మరో బిగ్‌ స్కామ్‌ వెలుగు చూసింది. నయా నేరగాళ్లు కొత్త తరహా స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకే ఊహించని షాకిచ్చారు. హైదరాబాద్‌లో బట్టబయలైన ఫింగర్ ప్రింట్ స్కామ్‌ ముఠా గుట్టును రట్టు చేశారు ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరి ఎస్ఓటీ పోలీసులు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు కనిపించకుండా సర్జరీలు చేస్తున్న డాక్టర్‌ సహా సిబ్బందిని పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు.

ఫింగర్ ప్రింట్ స్కామ్‌కు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌ భగవత్ కీలక విషయాలను వెల్లడించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వేలిముద్రలు తప్పనిసరి అని.. అయితే వేలిముద్రలు రిజక్ట్‌ కావడంతో యువకులు ఆపరేషన్ చేయించుకుంటున్నారని సీపీ తెలిపారు. సంవత్సరం పాటు వేలిముద్రలు కనబడకుండా ఉండే విధంగా కొత్తరకం సర్జరీ చేసుకున్న తర్వాత దొడ్డి దారిన గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారన్నారు.

శ్రీలంకలో మొదటి ఫింగర్‌ ప్రింట్‌ ఆపరేషన్‌ జరిగిందన్న సీపీ.. కేరళలో ఆరుగురు, రాజస్థాన్‌లో ఇద్దరు, తెలంగాణలో ఇద్దరికి ఫింగర్‌ ప్రింట్స్‌ ఆపరేషన్‌ జరిగిందని తెలిపారు. ఒక్కో సర్జరీకి 25 వేల రూపాయలు తీసుకున్నారన్నారు. హ్యూమన్ స్మగ్లింగ్‌తో ఫింగర్‌ ప్రింట్స్‌ మార్చుకున్న వాళ్లు కొందరు ఇప్పటికే కువైట్‌ వెళ్లారని చెప్పారు. నిందితులపై 420తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సీపీ మహేశ్ భగవత్ స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story