smuggling : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 5 కేజీల బంగారంతో స్మగ్లర్లు అరెస్ట్

దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం స్మగ్లర్ల గుట్టురట్టైంది. అక్రమం రవాణా చేస్తున్న ఐదు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.2.56 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో ఐదుగురు ప్రయాణికుల నుంచి బంగారాన్ని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఐతే ఈ ఐదుగురు వేరు వేరు రోజుల్లో పట్టుబడటం విశేషం. జూన్ 20న ఒకరిని అరెస్ట్ చేయగా, జూన్ 21, 22 తేదీల్లో మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కస్టమ్స్ అధికారులు వారిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్, మస్కట్, బ్యాంకాక్ ఇలా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల వద్ద భారీగా బంగారం పట్టుబడుతోంది. అయితే భారత కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నారు. బంగారం, డ్రగ్స్‌లను వెరైటీ స్మగ్లింగ్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు స్మగ్లర్లు. నోటిలో, కడుపులో, షూస్‌ల, ఆఖరికి లోదుస్తుల్లో దాచుకుని దర్జాగా బయట చెక్కేసే ప్రయత్నం చేసి అధికారుల తనిఖీల్లో దొరికిపోయిన ఘటనలు ఇటీవల బోలెడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com