క్రైమ్

Begum Bazaar Murder : బేగంబజార్‌ పరువు హత్య కేసులో నిందితుల అరెస్ట్..!

Begum Bazaar Murder : హైదరాబాద్‌ బేగం బజార్‌ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య తర్వాత కర్నాటక పారిపోయిన ఐదుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Begum Bazaar Murder :  బేగంబజార్‌ పరువు హత్య కేసులో నిందితుల అరెస్ట్..!
X

Begum Bazaar Murder : హైదరాబాద్‌ బేగం బజార్‌ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య తర్వాత కర్నాటక పారిపోయిన ఐదుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్ పై కక్ష కట్టిన యువతి కుటుంబీకులు నిన్న బేగం బజార్‌లో అత్యంత పాశవికంగా హత్య చేశారు. అటు నీరజ్ హత్యకు నిరసనగా ఇవాళ బేగం బజార్ బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు.

బేగంబజార్‌లోని షా ఇనాయత్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మచ్చీ మార్కెట్‌లో ఈ హత్య జరిగింది. రెండు బైక్‌లపై వచ్చిన ఐదుగురు అందరూ చూస్తుండగానే నీరజ్‌ పన్వార్‌పై కత్తులతో విరుచుకుపడ్డారు. అతన్ని 20 కత్తిపోట్లు పొడిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నీరజ్‌ పన్వర్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. నీరజ్‌ ఏడాది క్రితం, సంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.ఆరు నెలల క్రితం వీరికి ఒక కుమారుడు జన్మించాడు.

ప్రస్తుతం నీరజ్‌ పన్వార్‌ బేగం బజార్‌లో ఉండగా... భార్య అప్జల్‌ గంజ్‌లో ఉంటోంది. ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కక్షతోనే నీరజ్‌పై అమ్మాయి కుటుంబీకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. సరూర్‌ నగర్‌లో పరువు హత్య మరువక ముందు.... మళ్లీ అలాంటి పరువు హత్య జరగడంతో.. పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

Next Story

RELATED STORIES