చిన్నారి హత్యాచార నిందితుడు.. రాజు ఆత్మహత్యకు అయిదు కారణాలు..

చిన్నారి హత్యాచార నిందితుడు.. రాజు ఆత్మహత్యకు అయిదు కారణాలు..
చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాక.. ఆ డెడ్ బాడీని ఎలా బయటకు తీసుకెళ్లాలో రాజుకు అర్థం కాలేదు.

సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన రాజు.. సూసైడ్ చేసుకున్నాడు. అతడు ప్రాణాలు తీసుకోవడానికి ప్రధానంగా ఐదు కారణాలను చెప్పొచ్చు

చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశాక.. ఆ డెడ్ బాడీని ఎలా బయటకు తీసుకెళ్లాలో రాజుకు అర్థం కాలేదు. అందుకే ఆ మృతదేహాన్ని తన రూంలోనే ఉంచి పారిపోయాడు. తప్పయితే చేశాడు కానీ ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. తన గురించి పోలీసులు, ప్రజలు అందరూ డేగకళ్లతో వెదుకుతారని అర్థమైంది. అందుకే అది మానసికంగా రాజుపై విపరీతమైన ఒత్తిడిని పెంచింది. ఆ ప్రెజర్ లో ఏం చేయాలో కూడా అర్థమవ్వని పరిస్థితి. జనం చేతికి దొరికితే ప్రాణాలతో బయటపడడం కూడా కష్టమని భావించి ఉండొచ్చు. ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు.

దేశంలోనే అత్యంత నైపుణ్యమున్న పోలీసులుగా తెలంగాణ పోలీస్‌కు పేరుంది. సెల్ ఫోన్ వాడకపోవడం వల్ల రాజు ఆచూకీని కనుక్కోవడం లేటైంది కాని.. లేదంటే ఎప్పుడో పట్టుకునేవారు. అక్కడికీ అతడి ఫోటోని తీసి.. అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టారు. నిందితుడిని పట్టిస్తే.. ఏకంగా 10 లక్షల రూపాయిల రివార్డ్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఆటోస్టాండ్, బస్ స్టాండ్.. ఇలా జనం తిరగాడే అన్ని ప్రదేశాల్లోనూ ఫోటో పోస్టర్లు ఉంచారు. దీంతో తనను ఎవరైనా గుర్తుపట్టి పోలీసులకు అప్పగిస్తారేమోనన్న భయం.. రాజును సూసైడ్ చేసుకునేలా పురిగొల్పి ఉండొచ్చు.

ప్రజాగ్రహం ఎంత పదునుగా ఉంటుందో.. ఎంత కర్కశంగా ప్రాణాలు తీస్తుందో రాజుకు తెలియక కాదు. ముఖ్యంగా ఇలాంటి దారుణాలు జరిగేటప్పుడు ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతాయి. నిర్భయ ఘటన నుంచి చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి వాళ్ల చేతికి చిక్కితే.. ఇక అంతే సంగతులు. అంతటి ఆవేశంతో, ఆగ్రహంతో ప్రజల కంటపడితే కచ్చితంగా ప్రాణాలు తీసేస్తారన్న భయం రాజును వెంటాడి ఉండొచ్చు. అందుకే వాళ్లకు చిక్కకుండా త్పపించుకుని తిరిగినా.. ఎక్కువరోజులు అలా చేయలేకపోయాడు. ఎటూ తప్పించుకునే దారి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు.

సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా యాక్టివ్ గా ఉంది. నిందితుడు రాజు ఫోటోను పోలీసులు రిలీజ్ చేసిన వెంటనే.. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నింటిలోనూ అది దర్శనమిచ్చింది. చాలామంది వాట్సప్ లో తమ స్టేటస్ కింద పెట్టుకున్నారు. ఈరోజుల్లో చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అంటే.. ఏ ఒక్కరికి చిక్కినా ఇక అంతే సంగతులు. క్షణాల మీద పోలీసులకు సమాచారం చేరిపోతుంది. వేషం మార్చినా, భాష మార్చినా సరే.. లాభం లేదని అర్థమయ్యుంటుంది. అందుకే వేరే దారిలేక సూసైడ్ చేసుకుని ఉండొచ్చు.

అత్యాచారాల ఘటనలను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటోంది. అలాంటి కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. పైగా పోలీసులకు కచ్చితమైన ఆదేశాలను కూడా జారీచేసింది. అంటే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే.. నిందితుడు టెక్నాలజీని వాడకపోయినా సరే పట్టుకోగలదని రాజుకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణలో వాడవాడలా ప్రభుత్వ నెట్ వర్క్ ఉంటుంది. అంటే వాళ్ల నుంచి ఎటూ తప్పించుకోలేడు. దీంతో ఇక తాను చిక్కడం ఖాయమని అర్థమై ఉంటుంది. ఆ భావనతో, భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత తప్పదు. అప్పుడు నిందితులను పాపభీతి వెంటాడుతుందో లేదో కాని.. ప్రాణభయం మాత్రం వారికి ఉండి తీరుతుంది. ఆ ఒత్తిడిలో ఇలాంటి ఘటనకు పాల్పడే అవకాశముందంటున్నారు మానసిక నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story