ARREST: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో ఆయనను హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయసేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు ఇతర అధికారులపై స్థానికులు దాడికి యత్నించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిపై ప్రాథమికంగా ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని పోలీసులు అనుమానించారు. ప్రధాన నిందితుడు, బీఆర్‌ఎస్ కార్యకర్త సురేశ్ పరారీలో ఉన్నారని తెలిపారు. సురేష్ రాజ్ వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నాడనే ప్రాథమిక సాంకేతిక ఆధారాలు సేకరించారు. కలెక్టర్‌పై దాడికి ముందు, తర్వాత నరేందర్ రెడ్డితో సురేశ్ దాదాపు 40 సార్లు ఫోన్ లో మాట్లాడారని పోలీసులు గుర్తించారు. ఇదే కేసులో ఇప్పటికే 16 మందిని రిమాండ్‌కు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com