Banjara Hills Drugs Case: రాడిసన్‌ హోటల్‌ పబ్‌లోని డ్రగ్స్ కేసులో నలుగురి అరెస్ట్..

Banjara Hills Drugs Case: రాడిసన్‌ హోటల్‌ పబ్‌లోని డ్రగ్స్ కేసులో నలుగురి అరెస్ట్..
X
Banjara Hills Drugs Case: హైదరాబాద్‌ రాడిసన్‌ బ్లూ పార్టీ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ నెలకొంది.

Banjara Hills Drugs Case: హైదరాబాద్‌ రాడిసన్‌ బ్లూ పార్టీ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ నెలకొంది. పార్టీ లో పాల్గొన్న వారి జాబితాలో నిహారిక కొణిదెల పేరును పోలీసులు చేర్చారు. జాబితాలో 143 వ పేరుగా నిహారికను ప్రస్తావించారు. కొద్దిగంటల క్రితం విడుదలైన జాబితాలో నిహారిక పేరు కనిపించలేదు. రాత్రి పబ్‌కు వెళ్లిన వారిలో నిహారిక కూడా ఉన్నట్లు స్పష్టమైన సమాచారం ఉంది. అంతే కాదు ఉదయం పోలీస్‌ స్టేషన్‌లో కొద్ది గంటల పాటు ఆమెను పోలీసులు విచారించారు.

అక్కడి నుంచి ఇంటికి వెళ్తుండగా మీడియా ఆమె దృశ్యాలను కూడా చిత్రీకరించింది. అంతేకాదు స్వయంగా ఆమె తండ్రి నాగబాబే... నిహారిక ఈవెంట్‌కు హాజరైనట్లు తెలిపారు. ఇంత జరిగినా.. ఆమె పేరు జాబితాలో లేకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. బడాబాబాల పిల్లలను కావాలనే వదిలేశారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. చట్టాలు కొంతమందికి చుట్టాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.

ఇలా అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు రావడంతో పోలీసుల జాబితాలో సవరణ జరిగింది. ఇక మరోవైపు... డ్రగ్స వ్యవహారంపైనా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అభిషేక్, డీజే వంశీధర్‌రావు, కునాల్, అనిల్ అనే నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు కూడా చేశారు. వీరిలో కునాల్‌కు డ్రగ్ పెడ్లర్లతో లింకులు ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు.. కునాల్, వంశీధర్ రావుల చాట్‌లో వీఐపీల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story