Cyber Crime : పెట్టుబడుల పేరుతో రూ. 700 కోట్లు కొట్టేసారు

Cyber Crime : పెట్టుబడుల పేరుతో రూ. 700 కోట్లు కొట్టేసారు
చైనా ఆపరేటర్ల మోసానికి15,000 మంది భారతీయులు బలి

చైనా ఆపరేటర్ల మోసానికి15,000 మంది భారతీయులు బలయ్యారు. ఒక ఏడాదిలోరూ.700 కోట్లకు పైగా నష్టపోయారు. ఈ భారీ స్కామ్ ను హైదరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. కేసుకు సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టుగా హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీపీ ఆనంద్ ప్రకటించారు. ఈ మోసానికి సంబంధించిన డబ్బును దుబాయ్ ద్వారా చైనాకు తరలించారని, అందులో కొంత భాగాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి లెబనాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా నిర్వహిస్తున్న ఖాతాకు కూడా పంపించారని వెల్లడించారు. బాగా సంపాదిస్తున్న కొంతమంది సాఫ్ట్వేర్ నిపుణులు కూడా ఈ స్కామ్ లో రూ.82 లక్షల వరకు డబ్బులు కోల్పోయారని చెప్పారు. కేసుకు సంబంధించి హైదరాబాద్ లో నలుగురిని, ముంబైలో ముగ్గురిని, అహ్మదాబాద్ లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురి కోసం పోలీసులు వెతుకుతున్నారు.


అసలు ఈ మోసం ఎలా జరిగిందంటే..

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ అంటూ తో రేట్ అండ్ రివ్యూ అంటూ ఓ లింక్ క్లిక్ చేసి తాను మోసపోయినట్లు ఏప్రిల్ నెలలో శివ అనే ఓ బాధితుడు సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.1000 పెట్టుబడితో రూ.25,000 లాభమమని చెప్పడంతో అతను రూ.28 లక్షలు కోల్పోయాడు. విచారణ జరిపిన పోలీసులు.. షెల్ కంపెనీలకు చెందిన 48 ఖాతాలను గుర్తించారు. ఆ సమయానికి రూ.584 కోట్ల మోసం జరిగింది. అయితే విచారణ పూర్తి అయ్యేసరికి మోసగాళ్లు మరో రూ.128 కోట్లు కొట్టేసారు. ఇందులో మొత్తం 113 భారతీయ బ్యాంకు ఖాతాలను ఉపయోగించారు. ఆ డబ్బును వివిధ ఖాతాల ద్వారా తరలించారు. కొంత మొత్తాన్ని క్రిప్టో రూపంలోకి మార్చారు. ఆ తర్వాత వాటిని దుబాయ్ మీదుగా చైనాకు తరలించారు. ప్రస్తుతానికి పోలీసులు నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న 10.5కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు లఖ్‌నవూలో 60కి పైగా బ్యాంకు ఖాతాలు తెరిచారని, ఒక్కో ఖాతాను 2లక్షలకు చొప్పున విక్రయించారని తెలుస్తోంది.

బేసిక్ గా భారత సిమ్ కార్డులను ఉపయోగించి ఇక్కడే ప్రారంభించిన ఖాతాలను ఆ తర్వాత రిమోట్ గా దుబాయ్ నుండి ఆపరేట్ చేశారు. వీరు స్కామ్ కు సూత్రధారులైన చైనా ఆపరేటర్లతో డైరెక్ట్ కాంటాక్ట్ కలిగి ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ పేరు మీద, అలాగే నగరానికి చెందిన మునావర్ పేరు మీద ఫోన్లు రిజిస్టర్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హిజ్బుల్లా క్రిప్టో వాలెట్ గురించి NIAతో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేస్తామని చెబుతున్న పోలీసులు, ఈ క్రైమ్ మాస్టర్ మైండ్స్ అయిన ముగ్గురు చైనీయుల గురించి ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story