సముద్రతీరంలో యువతి ఫై ముగ్గురు యువకుల సామూహిక హత్యాచారం..!

సముద్రతీరంలో యువతి ఫై ముగ్గురు యువకుల సామూహిక హత్యాచారం..!
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 15 రోజుల కిందట ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 15 రోజుల కిందట ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సముద్ర తీరంలో ముగ్గురు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు సముద్ర తీరానికి వచ్చిన ఓ యువతిని చెరపట్టిన యువకులు అత్యాచారం చేయడమే కాకుండా బాధితురాలి నగ్న ఫోటోలు తీశారు. పది రోజుల తర్వాత మళ్లీ కోరిక తీర్చాలని వేధించారు. సహకరించకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

ఉప్పలగుప్తం మండలంలోని ఓ యువతి బంధువుల వివాహానికి వచ్చింది. స్నేహితులతో కలిసి కొమరగిరిపట్నం గడదారి సముద్రతీరానికి వెళ్ళింది. అక్కడే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకుల కన్ను యువతి పైన పడింది. ఆమెను బంధించి సామూహిక అత్యాచారం చేశారు. అదే సమయంలో బాధితురాలి ఫోటోలు తీశారు పది రోజుల తర్వాత మళ్లీ కోరిక తీర్చాలని యువతి పై ఒత్తిడి పెంచారు.

నగ్న ఫోటోలు నెట్లో పెడతామని యవతిని బెదిరించారు. వీరి ఆగడాలు రోజురోజుకీ మితిమిరడంతో యువతి బంధువులకు చెప్పేసింది. వెంటనే వారు అల్లవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags

Read MoreRead Less
Next Story