Nizamabad Gang Rape :నిజామాబాద్‌లో దారుణం.. యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం ..!

X
By - Gunnesh UV |29 Sept 2021 12:46 PM IST
Nizamabad Gang Rape : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించి నలుగురు సామూహిక అత్యాచారం చేశారు.
Nizamabad Gang Rape : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి మద్యం తాగించి నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. బస్టాండ్ సమీపంలోని ఓ ఆసుపత్రి గదిలో ఈ ఘటన జరిగింది. అపస్మారక స్థితిలో యువతిని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని సఖి సెంటర్ కు తరలించారు. సఖి సెంటర్ లో బాధితురాలిని అదనపు పోలీస్ కమిషనర్ ఉషా విశ్వనాథ్ విచారిస్తున్నారు. మరోవైపు సఖి సెంటర్ కు చేరుకున్న మహిళా కమిషన్ సభ్యురాలు సుదాం లక్ష్మీ... బాధితురాలిని పరామర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com