Ongole : లారీలో 300 గ్యాస్ సిలిండర్లు బ్లాస్ట్..

Ongole : లారీలో 300 గ్యాస్ సిలిండర్లు బ్లాస్ట్..
Ongole : ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ దగ్గర అమరావతి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది.

Ongole : ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ దగ్గర అమరావతి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి ఉలవపాడుకు వెళ్తున్న గ్యాస్‌ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఎగిరిపడ్డాయి.దాదాపు 100 సిలిండర్లు అగ్నికి ఆహుతయ్యాయి.లారీ కూడా పూర్తిగా దగ్ధం అయింది.ఐతే లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సిలిండర్లు ఎగిరిపడడంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో లారీలో 300 సిలిండర్లు ఉన్నాయి. పోలీసులు.ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story