ఘట్‌కేసర్‌ గ్యాంగ్‌ రేప్‌ అంత ఓ కట్టుకథ.. !

ఘట్‌కేసర్‌ గ్యాంగ్‌ రేప్‌ అంత ఓ కట్టుకథ.. !
ఇంట్లో వాళ్లపై అలిగి ఇంటికి వెళ్లలేక ఆడిన ఓ డ్రామా. ఘట్‌కేసర్‌ కథ సారాంశం ఇది. మరి కిడ్నాప్‌ డ్రామానే ఎందుకు ఆడిందంటే... ఆమెకు కిడ్నాప్‌ బ్యాక్‌డ్రాప్ కథలంటే ఇష్టమట.

ఇంట్లో వాళ్లపై అలిగి ఇంటికి వెళ్లలేక ఆడిన ఓ డ్రామా. ఘట్‌కేసర్‌ కథ సారాంశం ఇది. మరి కిడ్నాప్‌ డ్రామానే ఎందుకు ఆడిందంటే... ఆమెకు కిడ్నాప్‌ బ్యాక్‌డ్రాప్ కథలంటే ఇష్టమట. మరి ఆటో డ్రైవర్లనే ఎందుకు టార్గెట్ చేసింది అనడిగితే.. చిల్లర విషయంలో ఓసారి గొడవ అయిందట. పోలీసులు చూసినప్పుడు డ్రెస్‌ ఎందుకు చిరిగి ఉంది కదా అని అడిగితే... సీన్‌ క్రియేషన్‌లో భాగంగా తానే చింపుకున్నానని చెప్పింది. మరి కిడ్నాప్ చేశారని చెప్పిన ఆ సమయంలో ఆమె ఏం చేసింది.. నాలుగు కిలోమీటర్లు అటుఇటు తిరిగింది. ఓవరాల్‌గా ఘట్‌కేసర్‌ స్టోరీలో జరిగిందిదే.

ఘట్‌కేసర్ ఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ ఘటన ఓ డ్రామా అని తేల్చేశారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆ అమ్మాయి దిగాల్సిన స్టాప్ తర్వాత ఆటో దిగిందని.. అక్కడి నుంచి నడిచి వెళ్లి.. మరో ఆటో ఎక్కి తర్వాత అన్నోజీగూడలో దిగిందని సీపీ తెలిపారు. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. ఇంట్లో వాళ్లు అమ్మాయిని బయటకు పంపేస్తారనే ఉద్దేశంతోనే ఆమె కిడ్నాప్ డ్రామా ఆడిందన్నారు.

కాలేజీలో ఏం చదువుకుంటుందో తెలియదు గానీ.. ఆమెకు కిడ్నాప్‌లంటే ఇష్టమని.. ఆ సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉందని మహేశ్ భగవత్ తెలిపారు. ఆరు నెలల క్రితం కూడా తన స్నేహితురాలితో కిడ్నాప్ గురించి ఓ కథ చెప్పిందన్నారు. అమ్మాయి చేసిన పని వల్ల వంద మందికిపైగా సిబ్బంది, వందకుపైగా సీసీటీవీ ఫుటేజీలను మూడు రోజులపాటు నిద్ర కూడా పోకుండా పరిశీలించారు. ఫార్మసీ స్టూడెంట్ ఎక్కడెక్కడ తిరిగిందో.. సీసీటీవీ ఫుటేజీలను ఎడిట్ చేసి మీడియాకు ప్రదర్శించారు పోలీసులు.

రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్‌కు చెందిన అమ్మాయి.. కండ్లకోయలోని ప్రైవేట్ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది. బుధవారం సాయంత్రం కాలేజీ ముగిసినా ఇంటికా రాలేదు. చీకటి పడడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని తెలిపింది. వారు వెంటనే డయల్ 100కి కాల్ చేశారు. ఆమె ఫోన్ చేసిన సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అన్నోజిగూడ ఓర్ఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో పోలీసులు గాలించారు. అక్కడ రోడ్డు పక్కన యువతి కనిపించడంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనను ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారని చెప్పింది.

ఫార్మసీ స్టూడెంట్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. వెంటనే నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేకపోవడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలకు మరోసారి పరిశీలించారు. ఆ రోజు సాయంత్రం ఘట్‌కేసర్, యానాంపేట్, అన్నోజిగూడ్ ప్రాంతాల్లో యువతి ఒంటరిగానే సంచరించినట్లు పోలీసుగు గుర్తించారు. అంతేకాదు ఆ సమయంలో ఆటో డ్రైవర్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆ ప్రాంతాల్లో లేవు. పోలీసులకు సీన్ అర్ధమయింది. యువతిని మరోసారి గట్టిగా ప్రశ్నించడంతో.. అసలు నిజం కక్కేసింది. ఈ కేసు విచారణలో ఆటో యూనియన్లు బాగా సహకరించారని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పోలీసుల తరపున వారికి క్షమాపణలు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story