టీ పెట్టడానికి టైమ్ పడుతుందనే సరికి.. కోపంతో భార్యని

టీ పెట్టడానికి టైమ్ పడుతుందనే సరికి.. కోపంతో భార్యని
అడిగిన వెంటనే టీ ఇవ్వలేదని భార్యపై కోపంతో ఊగిపోయిన భర్త ఆమెను కత్తి తీసుకుని నరికి చంపేశాడు.

అడిగిన వెంటనే టీ ఇవ్వలేదని భార్యపై కోపంతో ఊగిపోయిన భర్త ఆమెను కత్తి తీసుకుని నరికి చంపేశాడు. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లోని భోజ్‌పూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో సుందరి నిద్రలేచి వంటగదిలో టీ చేయడం ప్రారంభించింది.

“కొన్ని నిమిషాల తర్వాత మేల్కొన్న ధరమ్‌వీర్ ఆమెను టీ కోసం పిలిచాడు. వాళ్ల నలుగురు పిల్లలు (ముగ్గురు అబ్బాయిలు , ఒక అమ్మాయి) ఇంకా నిద్ర లేవలేదు. టీ అడిగాను ఇంకా అవలేదా అని కోపంతో భార్యని అరిచాడు ధర్మవీవర్. అవుతోంది అని చెప్పింది భార్య. “ఐదు నిమిషాల తర్వాత, ధరమ్‌వీర్ మళ్లీ టీ అడిగాడు.. అయినా అదే సమాధానం.. దాంతో వెంటనే టెర్రస్‌పై నుంచి దిగి వంటగదిలో ఉన్న భార్య దగ్గరకు వెళ్లాడు. టీ సిద్ధం కావడానికి మరో 10 నిమిషాలు పడుతుందని భార్య సమాధానం చెప్పడంతో కోపంతో ఊగిపోయాడు. వంటగదిలో ఉన్న పాత్రలను కాలితో తన్నాడు. అక్కడే ఉన్న కత్తి తీసుకుని వెనుక నుండ భార్యను నరికివేశాడు.

"కత్తి పోటు గాయాలకు ఆమె కేకలు వేయడంతో నిద్ర నుండి జారుకున్న పిల్లలు డాబాపైకి పరుగెత్తి తమ తల్లిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ధరమ్‌వీర్ వారిపై కూడా కత్తి దూశాడు. వారు భయంతో పరిగెట్టారు. ఆ దంపతుల కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. “మా నాన్న టీ కోసం తరచూ అమ్మతో గొడవ పడేవాడు. అతనికి రోజుకు కనీసం ఐదు-ఆరు సార్లు టీ తాగే అలవాటు ఉంది. మా అమ్మ చాలాసార్లు టీ చేయడానికి నిరాకరించినా లేదా టీ పెట్టడానికి ఎక్కువ సమయం తీసుకున్నా ఆమెను గట్టిగా అరిచేవాడు. కానీ అతను మా అమ్మను కొట్టడం నేను ఎప్పుడూ చూడలేదు అని తల్లి మృతదేహాన్ని చూసి రోదిస్తూ పోలీసులకు వివరించాడు.

అధికారులు వచ్చే వరకు మృతదేహం పక్కన ధరమ్‌వీర్ కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. అతడిని అరెస్టు చేసి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు.“మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా, IPC సెక్షన్ 302 (హత్య) కింద ధరమ్‌వీర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు' అని యాదవ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story