యువతిని హత్య చేసి కాల్చేసిన కిరాతకులు

యువతిని హత్య చేసి కాల్చేసిన కిరాతకులు

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని హత్య చేసి కాల్చేశారు కిరాతకులు. ధర్మవరం మండలం బడనపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ప్రదేశంలో ఐడీ కార్డు లభ్యం కావడంతో.. ఆ యువతిని స్నేహలతగా గుర్తించారు పోలీసులు. అనంతపురం టూటౌన్‌ పీఎస్‌లోనూ మిస్సింగ్‌ కేసు సైతం నమోదైంది. అటు..ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో స్నేహలత మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. తల్లిదండ్రులు రాజేష్‌ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తుండడంతో.. పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story