Hyderabad: బీరువా మీద పడి బిడ్డ ప్రాణాలు..
అమ్మతో వెళ్లింది.. ఆడుకుందామనుకుంది. కానీ మృత్యువు ఆ చిన్నారి ఆటలు సాగనివ్వలేదు.
BY Gunnesh UV10 Aug 2021 5:12 AM GMT

X
Gunnesh UV10 Aug 2021 5:12 AM GMT
Hyderabad: అమ్మతో వెళ్లింది.. ఆడుకుందామనుకుంది. కానీ మృత్యువు ఆ చిన్నారి ఆటలు సాగనివ్వలేదు. అమ్మ కళ్ల ముందే అప్పటి వరకు తిరుగాడిన చిన్నారి కన్నుమూసింది. బోడుప్పల్ దేవేందర్ నగర్ కాలనీలో నివసించే కుంచాల మధు, లత దంపతులకు ముగ్గురు కుమార్తెలు. లత స్థానిక సిద్ధార్థ కాలేజీలో ఆయాగా పని చేస్తున్నారు.
సోమవారం లత పనికి వెళుతూ కుమార్తె కీర్తి(8)ని కూడా తీసుకెళ్లింది. పనిలో భాగంగా బీరువాలు శుభ్రం చేస్తోంది లత. అక్కడే ఆడుకుంటున్న కీర్తిపై బీరువా పడింది. అనుకోని ఈ సంఘటనకు హతాశురాలైన లత సిబ్బంది సాయంతో చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కానీ తీవ్ర గాయాలైన బాలిక అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
RELATED STORIES
Irregular Periods: ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి ఈ ఐదు ఆహారపదార్థాలు.....
19 Aug 2022 7:42 AM GMTSoft Drinks: సాప్ట్ డ్రింక్స్ తాగుతున్నారా.. వాటి వల్ల కలిగే...
18 Aug 2022 7:30 AM GMTBread: ఖాళీ కడుపుతో బ్రెడ్.. రోజూ అదే బ్రేక్‌ఫాస్ట్.. ఆరోగ్యానికి..
17 Aug 2022 5:57 AM GMTNatural Mouth Wash: నోటి ఆరోగ్యానికి ఇంట్లోనే మౌత్ వాష్.. తయారీ ఈ...
15 Aug 2022 8:51 AM GMTBadam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMT