Kerala: వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి.. 19 ఏళ్ల తర్వాత..

Kerala: వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి.. 19 ఏళ్ల తర్వాత..
Kerala: ప్రాణం కాపాడే డాక్టర్ ని దేవుడిగా కొలుస్తారు.. అదే డాక్టర్ ప్రాణాలు పోవడానికి కారణమైతే ఆ కుటుంబం వేదన వర్ణనాతీతం.

Kerala: ప్రాణం కాపాడే డాక్టర్ ని దేవుడిగా కొలుస్తారు.. అదే డాక్టర్ ప్రాణాలు పోవడానికి కారణమైతే ఆ కుటుంబం వేదన వర్ణనాతీతం. కొందరి వైద్యుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది. తమ బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణమైన డాక్టర్ పై కేసు వేయగా 20 ఏళ్ల తరువాత వారికి తీర్పు వచ్చింది.

కేరళకు చెందిన అంజలికి ౧౯౯౬లో బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారిని చికిత్స నిమిత్తం కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆమెకు క్యాన్సర్ పూర్తిగా నయమైందని డాక్టర్ చెప్పారు.

అయితే 2022లో అంజలి దృష్టి మసకబారడం ప్రారంభించింది. దాంతో తల్లిదండ్రులు చిన్నారిని దగ్గరలో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. అతడు మైగ్రేన్ అని నిర్ధారించి మందులు రాసి ఇచ్చి వాడమన్నారు. ఏడాది తర్వాత అంజలి చూపు మొత్తం పోయింది. దీంతో కొన్ని అధునాతన పరీక్షలు చేయగా క్యాన్సర్ వల్ల చూపు పోయిందని నిర్ధారించారు వైద్యులు.

దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారిని కోయంబత్తూరులోని వైద్యశాలకు తరలించారు. బాలికకు ఎప్పుడూ కీమోథెరపీ సూచించలేదని తెలుసుకున్న వైద్యులు షాక్‌కు గురయ్యారు. అంజలికి క్యాన్సర్ వ్యాధి ముదిరిపోయిందని తెలిపారు.

ఇప్పుడు కీమోలు ఇచ్చినా ఉపయోగం లేదని అన్నారు. ఉపశమనం కోసం మందులు రాసి ఇచ్చారు. మరుసటి ఏడాది అంజలి ప్రాణాలు కోల్పోయింది. దీంతో అంజలి తల్లిదండ్రులు మొదట క్యాన్సర్ అని నిర్ధారించి వైద్యం చేయని డాక్టర్ పై కేసు వేశారు. అతని నుంచి నష్టపరిహారం కోరారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ వైద్యుడి నుంచి ఆ మొత్తాన్ని దంపతులకు అప్పగించింది. కోర్టు ఆదేశాలపై అంజలి తల్లి మినీ గణేష్ స్పందిస్తూ ఎట్టకేలకు తమకు న్యాయం జరిగిందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story