Kurnool : కర్నూలులో హనీ ట్రాప్.. యువకుడిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న కిలేడి..

Kurnool : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోయింది. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హనీ ట్రాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. యువత బలహీనతలను క్యాష్ చేసుకుంటున్న మోసగాళ్లు... వారికి అమ్మాయిల్ని ఎరగా వేస్తున్నారు. సెమీ న్యూడ్ కాల్స్‌తో ట్రాప్ చేసి డబ్బులు గుంచుతున్నారు. కట్టకుంటే వారిని రోడ్డుకు లాగుతున్నారు.
తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హనీ ట్రాప్‌కు ఓ యువకుడు బలయ్యాడు. ఇతడికి ఓ యువతి నుంచి సెమీ న్యూడ్ వీడియో కాల్ వచ్చింది. తాను ఆ కాల్‌కు రెస్పాండ్ అయ్యాడు. అంతే ఇక అప్పుడే మొదలైంది అసలు కథ. రంగంలోకి దిగిన కేటుగాళ్లు... యువకుడి ఫోటోను మార్ఫింగ్ చేసి అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్లు సెట్ చేశారు. మార్ఫింగ్ చేసిన ఆ న్యూడ్ వీడియోని బాధితుడికి పంపి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు పంపకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడ్తామని వార్నింగ్ ఇచ్చారు.
షాక్‌కు గురైన బాధిత యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. విషయం చెప్పడంతో ఆ కిలాడీ లేడీని, ఆమె వెనుకున్న ట్రాప్ గ్యాంగ్‌ని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. హనీ ట్రాప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అన్ నోన్ నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లేపకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com