LB Nagar: ఎల్బీనగర్ ప్రేమోన్మాది కేసులో బయటపడుతున్న నిజాలు..

LB Nagar (tv5news.in)
LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో.. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు వైద్యులు. అయితే.. బసవరాజు అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదంటున్నారు యువతి తల్లిదండ్రులు. ఎప్పుడు కూడా అతనిని చూడలేదంటున్నారు. అతన్ని చూస్తే గుర్తుపడతామంటున్నారు తల్లిదండ్రులు.
బుధవారం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో.. బసవరాజు యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన యువతి.... అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. 3 నెలల క్రితం యువతికి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. బస్వరాజ్‌తో ప్రేమ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి యువతిని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆమె బాబాయి ఇంట్లో ఉంచారు.
సన్‌సిటీ సమీపంలోని రామ్‌దేవ్‌గూడలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బస్వరాజ్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో నిన్న మధ్యాహ్నం యువతి ఉంటున్న ఇంటికి చేరుకొని ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. యువతి పొట్ట, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు యువతిని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి 14 రోజుల రిమాండ్‌ను విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com