పెళ్లి కూతురి కళ్లలో ఫెవీక్విక్.. ప్రియురాలి ఘాతుకం

పెళ్లి కూతురి కళ్లలో ఫెవీక్విక్.. ప్రియురాలి ఘాతుకం
మొరా తలబ్ గ్రామానికి చెందిన గోపాల్ రామ్‌ని అతడి చెల్లెలి స్నేహితురాలు ప్రేమించింది.

ప్రేమించింది నేను.. పెళ్లి చేసుకునేది నువ్వా అని కొత్త పెళ్లి కూతురిపై అక్కసు పెంచుకుంది.. అవకాశం కోసం ఎదురు చూసింది.. అర్థరాత్రి ఆదమరిచి నిద్ర పోతున్న ఆమె జుత్తు కత్తిరించి, కళ్లలో ఫెవీక్విక్ పోసింది ఆమె భర్తని ప్రేమించిన ప్రియురాలు. ఈ అమానుష ఘటన బిహార్‌‌లోని నలంద జిల్లాలో జరిగింది. మొరా తలబ్ గ్రామానికి చెందిన గోపాల్ రామ్‌ని అతడి చెల్లెలి స్నేహితురాలు ప్రేమించింది.

తాను ప్రేమిస్తున్న విషయం అతడికి తెలపలేదు.. తన ప్రేమను లోపలే దాచుకుంది.. ఇంతలో అతడు షేక్‌పురాకి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ప్రియుడు తనకు దక్కలేదన్న కోపంతో ఉన్మాదిగా మారి పోయింది. పెళ్లి చేసుకుని గ్రామానికి వచ్చిన వధూవరులను పలకరించేందుకు వరుడి ఇంటికి వచ్చింది. చెల్లెలి ఫ్రెండే కదా అనుకున్నారు కుటుంబసభ్యులు. ఎవరికీ కించిత్ అనుమానం రాలేదు. రాత్రి వేళ కూడా పెళ్లి వారింట్లోనే పడుకుంది..

ఆ రాత్రే తన పధకానికి తెర తీసింది. అర్థరాత్రి అందరూ నిద్ర పోతున్న సమయంలో వధువు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమె జుట్టు కత్తిరించింది. కళ్లలో ఫెవీక్విక్ పోసింది. కళ్లు మూసుకుపోవడంతో పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులకు గాఢ నిద్రలో ఉన్న కుటుంబసభ్యులు ఉలిక్కిపడి లేచారు. అప్పటికే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న యువతిని చితకబాదారు. ఆమెను ఇంట్లోనే నిర్భంధించి పోలీసులకు అప్పగించారు. వధువు కళ్లలో కెమికల్ పడడంతో ఆమెను ఆస్పత్రికి తరలిచారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు కంటిచూపు పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story