ప్రేమను తిరస్కరించిన ప్రియురాలు.. ఆమెతో ఫోన్ మాట్లాడుతూ ప్రియుడు ఆత్మహత్య

తాను ప్రేమించిన యువతి తన ప్రేమను కాదనే సరికి ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. అప్పటి వరకు ఆమెతో మాట్లాడి తన ప్రేమను తిరస్కిరించినందుకు గాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. నిండు నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకున్నాడు.
వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన ఇమ్రోజ్ పటేల్ కొన్ని సంవత్సరాలుగా రాజేంద్ర నగర్ లోని పరమారెడ్డి హిల్స్ లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అతడు ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. కానీ గత కొంత కాలం నుంచి ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయి. ఆమె అతడిని దూరం పెట్టింది.
ఆ విషయాన్ని జీర్ణించుకోలేని ఇమ్రోజ్ మనస్థాపం చెందాడు. మంగళవారం రాత్రి ప్రేమించిన యువతికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దాంతో కంగారు పడ్డ యువతి అతడి ప్లాట్ కు దగ్గరలో ఉన్న మరో స్నేహితుడికి ఫోన్ చేసి ఇమ్రోజ్ ప్లాట్ కు వెళ్లాలని సూచించింది. కానీ అతడు వెళ్లే సమయానికే ఇమ్రోజ్ ఫ్యాన్ కు వేళ్లాడుతూ కనిపించాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com