GOA : డచ్ యువతిని రక్షించిన యువకుడిపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్

GOA : డచ్ యువతిని రక్షించిన యువకుడిపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్
X

డచ్ టూరిస్ట్ పై అగాయిత్యం చేయడానికి ప్రయత్నించడంతో పాటు అడ్డుకున్న యువకునిపై కత్తితో దాడి చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన నార్త్ గోవాలోని పెర్నమ్ జిల్లాలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. గోవాలోని పెర్నెమ్ జిల్లాలో డచ్ కు చెందిన ఓ మహిళా టూరిస్ట్ రిసార్ట్ లో నివసిస్తోంది. అదే రిసార్ట్ లో పనిచేస్తున్న అభిషేక్ వర్మ అనే వ్యక్తి గురువారం సాయంత్రం యువతి నివసిస్తున్న రూంకు వెళ్లి అగాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. యువతి అరుపులు విన్న స్థానిక వ్యక్తి వెళ్లడంతో వర్మ అక్కడినుంచి పారిపోయాడు. క్షణాల్లోనే తిరిగి వచ్చి యువకుడిపై కత్తితో దాడి చేశాడు వర్మ. పోలీసులుకు ఫిర్యాదు చేయగా నిందితుడు వర్మను అరెస్ట్ చేశారు. సదరు యువకున్ని హాస్పిటల్ కు తరలించినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిధిన్ వల్సన్ తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 452, 352, 207, 506 (II) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

Tags

Next Story