Gorakhnath Temple : మరణ శిక్ష విధించిన NIA కోర్టు

Gorakhnath Temple : మరణ శిక్ష విధించిన NIA కోర్టు
నిందితుడు ముంబై ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీర్ చేసినట్లు తెలిపారు పోలీసులు


గోరఖ్ నాథ్ ఆలయంతో పాటు పోలీసులపై దాడి చేసిన నిందితుడికి మరణ శిక్ష విధించింది (national investigation agency) NIA కోర్టు. తొమ్మిది నెలల తర్వాత తీర్పును వెలువరించింది. గతఏడాది ఏప్రిల్ లో ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ నాథ్ ఆలయం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి చేశాడు ముర్తబా అబ్బాసి. పోలీసులు వెంబడించి అబ్బాసిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన నిజాలు బయటకు వచ్చాయి. అబ్బాసీకి తీవ్రవాద సంస్థ 'ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియాతో' సంబందం ఉన్నట్లు తేలింది. ముర్తబా అబ్బాసీ ISISI కోసం పనిచేస్తున్నాడని తెలిపారు యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.


నిందితుడు ముంబై ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలయం వద్ద గస్తీ కాస్తున్న పోలీసులపై దాడి చేసి గాయపరిచాడని అన్నారు. పోలీసుల రైఫిల్స్ ను లాక్కోవడానికి ప్రయత్నించాడని చెప్పారు. ఆలయంపై దాడి చేయడానికి ప్రయత్నించడమే కాకుండా, పోలీసులపై దాడి చేశాడని తెలిపారు. నిందితుడికి టెర్రరిస్ట్ లతో సంబందాలు ఉన్నాయన్న సాక్షాలను కోర్టుకు యూపీ ఏటీఎస్ అధికారులు సమర్పించడంతో మరణశిక్ష విధించింది NIA కోర్టు. ఆలయం సమీపంలోనే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ నివాసం ఉండటం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story