కూతురికి రెండో పెళ్లి చేయడం కోసం మనవడిని చంపిన అమ్మమ్మ..!

కూతురి రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని మనవడిని చంపేసింది ఓ అమ్మమ్మ.. ఈ ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన యశ్వంత్(2) గురువారం కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల, కుటుంబ సభ్యులు స్థానికులు ఎంత గాలించిన దొరకలేదు. శుక్రవారం అనూహ్యంగా బిబ్బిలకుంట చెరువులో శవమై తేలాడు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు. విచారణలో భాగంగా యశ్వంత్ ని చంపేసినట్టుగా ఆ అమ్మమ్మ ఒప్పుకుంది. దీనికి మరోవ్యక్తి సహాయం తీసుకున్నట్లుగా ఆమె తెలిపింది. భర్త చనిపోయిన తన కూతురికి రెండో పెళ్లి చేయాలని అనుకుంది. అయితే అందుకు ఆమె మనవడు అడ్డుగా కనిపించడంతో ఏ మాత్రం కనికరం చూపకుండా మనవడిని కిరాతకంగా చంపేసి చెరువులో పడేసింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com