Vikarabad : వికారాబాద్‌లో దారుణం.. పెన్షన్ డబ్బుల కోసం నానమ్మని..

Vikarabad : వికారాబాద్‌లో దారుణం.. పెన్షన్ డబ్బుల కోసం నానమ్మని..
Vikarabad : మాటలు నేర్పిన ఆ బామ్మనే బండ బూతులు తిడుతూ.. గొడ్డును బాదినట్లు ఎలా చావ బాదుతున్నాడో చూడండి.

Vikarabad : పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. తల్లిదండ్రుల తర్వాత మనల్ని అంత ప్రేమగా చూసుకునేది అమ్మమ్మో లేదా నానమ్మో. మనం నవ్వితే వాళ్లకు పట్టలేనంత సంతోషం. నా మనవడు రాజు రాజు... అంటూ ఎంతో మురిసిపోతుంటారు. కాస్త కంటతడి పెడితే ఆముసలి గుండె అస్సలు తట్టుకోలేదు. మరి పెద్దయ్యాక వాళ్లను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. మనకిచ్చింనంత ప్రేమ తిరిగివ్వలేం గానీ... వాళ్లను బాధపెట్టే హక్కయితే మనకు లేదుకదా...?. కానీ ఈ దారుణం చూడండి. వీడు మనిషా.. లేక పశువా. తప్పతాగి డబ్బుల కోసం నానమ్మను ఎంతలా హింసిస్తున్నాడో.

వయసు మళ్లిందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కాళ్లతో ఎలా తన్నుతున్నాడో చూడండి. మాటలు నేర్పిన ఆ బామ్మనే బండ బూతులు తిడుతూ.. గొడ్డును బాదినట్లు ఎలా చావ బాదుతున్నాడో చూడండి. కనీసం ప్రతిఘటించలేని ఆ బామ్మపై వీడి పైశాచికత్వం చూసిన వాళ్లంతా .

మానవత్వానికే మచ్చతెచ్చే ఈ అమానుష ఘటన వికారాబాద్‌ జిల్లా పెద్దముల్ మండలం మంబాపూర్‌లో జరిగింది. మనవడి చేతిలో చావు దెబ్బలు తింటున్న ఈ బామ్మ పేరు యశోద. ఈమె మనవడు గోవర్ధన్ తాగుబోతు. మద్యానికి బానిసైన ఇతడు.. తరచూ డబ్బుల కోసం యశోదమ్మను ఇలాగే వేధిస్తుంటాడు.

ఇవాళ కూడా ఫుల్లుగా తాగొచ్చి... పెన్షన్‌ డబ్బులు కావాలంటూ నానమ్మపై దాడి చేశాడు. పాపం ఈ ముసలమ్మ... తన పెన్షన్‌ డబ్బుల్లో కొన్ని అప్పటికే ఈ దుర్మార్గుడికి ఇచ్చింది. ఐనా వినకుండా మిగతా డబ్బులు కూడా కావాలంటూ బామ్మను గొడ్డును బాదినట్లు బాదాడు. పాపం దెబ్బలకు తట్టుకోలేక ఆఅమ్మ ఏడుపు చూస్తుంటే.... మనకు కూడ కంటనీరు రాక మానదు.

అభంశుభం తెలియని బామ్మపై మృగంలా ప్రవర్తించిన గోవర్ధన్‌పై సోషల్‌ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ పశువును కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పెద్దవాళ్లపై చేయి లేపాలంటే... వణికిపోయేలా వీడికి శిక్ష ఉండాలని పోలీసులను కోరుతున్నారు. మరి గోవర్ధన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story