మహానగరంలో మాయగాడు.. లగ్జరీ కార్లే లక్ష్యం... సినిమా స్టైల్లో..

luxury cars: మాంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ITలోనో, మరో దాంట్లోనో లక్షలకు లక్షలు జీతాలు తీసుకునేవాళ్లను చూశాం. కానీ.. అంత బుర్రా పెట్టుకుని దొంగనాలు చేసే వాళ్లను చూశామా..! ఇప్పుడు మనం చెప్పుకుంటోంది అలాంటి ఓ కంత్రీ గురించే. పైగా.. ఈ కిలాడీకి కొన్ని ప్రత్యేకమైన హ్యాబిట్స్ ఉన్నాయ్. ఏంటి కొట్టేయడంలోనూ స్టైలా అని అనుకోకండి. ఈ స్టోరీ చూడండి.
చూశారు కదా ఎంత దర్జాగా కార్లను అన్‌లాక్ చేస్తున్నారో.... కేటుగాళ్లు కూడా టెక్నాలజీని బాగా వాడేస్తున్నారని చెప్పడానికి ఈ సినిమా సీన్ ఒక ఉదాహరణ. అచ్చంగా ఈ తరహాలోనే ఓ కుర్రాడు కార్లను అన్‌లాక్ చేస్తున్నాడు. అలాగని ఏ కారు పడితే ఆ కారు కాదు.. అతను కొట్టేసేదానికి ఓ రేంజ్ ఉండాలి.. అలాంటివాటిపైనే అతని కన్ను పడుతుంది. ఒక్కసారి ఫిక్సయ్యాడా క్షణాల్లోనే ఆ లగ్జరీ కారుతో అక్కడి నుంచి జంపై పోతున్నాడు. ఇప్పటికి హైదరాబాద్ సిటీలో చాలా మందికి ఇలాగే ధమ్కీ ఇచ్చి.. జాలీగా విజిల్ వేసుకుంటూ చెక్కేశాడు.
ఈ కంత్రీగాడు ఎలా ఉంటాడో తెలియదు. ఎక్కడా సీసీ ఫుటేజ్‌కీ దొరకలేదు. చివరికెలాగో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పేరు, ఊరు కనిపెట్టగలిగారు. చివరికి ఈ హైటెక్ చోరీలు చేస్తోంది రాజస్థాన్ జైపూర్‌కు చెందిన సత్యేంద్ర షెకావత్‌గా గుర్తించారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఇతను.. ఉన్నత చదువుల కోసమని హైదరాబాద్‌కి వచ్చాడు. తనకున్న టెక్నికల్ నాలెడ్జ్‌తో కార్లను అన్‌లాక్ చేసే సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశాడు. ఆ తర్వాత యాక్షన్ షురూ చేశాడు. లగ్జరీ కార్లను టార్గెట్‌గా పెట్టుకుని ఏడాది నుంచి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
ఆ మధ్య బంజారాహిల్స్ పార్క్ హయత్ హొటల్‌లో ఓ ప్రొడ్యూసర్ పార్క్ చేసిన కారును సినిమా స్టైల్లో లేపేశాడు. అంతకు ముందు ఏప్రిల్ లో నాచారం వద్ద కూడా ఇదే స్టైల్లో ఒక కారు అపహరించాడు. పబ్లిక్ ప్లేస్‌లో నచ్చిన కారు కనిపిస్తే.. అది నాదే అని ఫీలవుతూ వేసుకుని వెళ్లిపోతున్నాడు. గతంలో దొరికిన క్లూస్ ఆధారంగా అతని కోసం జైపూర్ వెళ్లారు బంజారాహిల్స్ పోలీసులు. కానీ ఈ సత్యేంద్ర షెకావత్ చిక్కలేదు. తాజాగా సైబరాబాద్ పరిధిలోని దుండిగల్ లో మరో లగ్జరీ కారు మాయం చేసేశాడీ హైటెక్ కిలాడీ.
వరుస చోరీల నేపథ్యంలో కేసును మరింత సిరియస్‌గా తుసుకున్న పోలీసులు.. జైపూర్‌లో అతని భార్యను అరెస్ట్ చేసి జైల్‌కు పంపించారు. ఆపై ఆమె బెయిల్‌పై విడుదలైంది. కానీ ఈ కేడుగాడి జాడ మాత్రం దొరకలేదు. ఇప్పుడు మూడు కమిషనరేట్ల పోలీసులు ఈ కంత్రీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com