Gujarat : మైనర్ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

Gujarat  : మైనర్ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

మైనర్ బాలికను 34 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడికి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ కోర్టు మరణశిక్ష విధించింది. గుజరాత్ లోని జెట్‌పూర్‌లోని జెతల్‌సర్‌ గ్రామానికి చెందిన జయేష్ సర్వయ్య (26) అదే గ్రామానికి చెందిన 11వ తరగతి చదువుతున్న యువతిని లైంగికంగా వేధించసాగాడు. మార్చి 2021 న ఆయువతి ఇంటికి వెళ్లి బలవంతం చేశాడు. అందుకు నిరాకరించిన యువతిని కత్తితో పొడిచి చంపాడు. అడ్డువచ్చిన యువతి సోదరుడిపై కూడా దాడి చేశాడు. ఈ కేసులో జయేష్ సర్వయ్యకు అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి RR చౌదరి మరణశిక్ష విధించింది.


నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఇది "అరుదైన కేసు" అని కోర్టు పేర్కొంది. జయేష్ సర్వయ్యపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. "ఐపిసి సెక్షన్ 302 కింద కోర్టు ఉరిశిక్ష, ₹ 5,000 జరిమానా విధించింది... ఇది మొత్తం సమాజాన్ని కదిలించిన హత్య మరియు అందువల్ల దీనిని తీవ్రంగా పరిగణించాము" అని న్యాయమూర్తి చెప్పారు. అప్పీలు చేసుకునేందుకు దోషికి నెల రోజుల సమయం ఇచ్చినట్లు తెలిపారు.


మార్చి 16, 2021 న జయేష్ యవతిని అత్యాచారం చేయడానికి చూశాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన సర్వయ్య బాలికను కొట్టి, ఆమె ఇంటిబయట అందరూ చూస్తుండగానే పలుమార్లు కత్తితో పొడిచాడు. షాక్‌కు గురైన స్థానికులు అతడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బంద్‌లు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Tags

Next Story