Crime: లక్నో కోర్టులో కాల్పుల కలకలం

Crime: లక్నో కోర్టులో కాల్పుల కలకలం
X
ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌వార్‌ మళ్లీ కోరలు విప్పింది. ఈ క్రమంలోనే లక్నో కోర్టులో దుండగులు కాల్పులు జరిపారు

ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌వార్‌ మళ్లీ కోరలు విప్పింది. ఈ క్రమంలోనే లక్నో కోర్టులో దుండగులు కాల్పులు జరిపారు. ముక్తార్‌ అనుచరుడు సంజీవ్‌ను ప్రత్యర్థులు కాల్చారు. దీంతో ఒక్కసారిగా కోర్టు అవరణమంతా షాక్‌కు గురైంది. లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరపడంతో అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడి వారు అక్కడ పరుగులు తీశారు. కాల్పుల్లో కొందరు పోలీసులకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. గాయపడిన వారిని తోటి పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వారికోసం లక్నో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags

Next Story