ఛీ ఛీ ఎంత దుర్మార్గం.. ఊయలలో నిద్రిస్తున్న పసిపాపనీ వదలని కామాంధులు..

ఛీ ఛీ ఎంత దుర్మార్గం.. ఊయలలో నిద్రిస్తున్న పసిపాపనీ వదలని కామాంధులు..
భగవంతుడా.. వినాలంటేనా బాధగా ఉంది. పాపం ఆ చిట్టి తల్లి ఇంకెంత బాధపడి ఉంటుంది.

భగవంతుడా.. వినాలంటేనా బాధగా ఉంది. పాపం ఆ చిట్టి తల్లి ఇంకెంత బాధపడి ఉంటుంది. అమ్మా అని పిలవడం కూడా రాదే. కళ్ల ముందు ఏం జరుగుతుందో కనీస మాత్రంగా కూడా తెలియదే. తాజాగా జరిగిన ఓ సంఘటన సమాజం సిగ్గుతో తలవంచుకునేదిగా ఉంది. గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మృగం కంటే హీనంగా మారిన ఓ ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. 7 నెలల పసి పాపపై అత్యాచారానికి తెగబడ్డాడు. అత్యంత అమానుషంగా చిన్నారిని హింసించి ఆపై రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు. మాచర్ల మండలం బోదనంపాడులో జరిగిందీ ఘోరమైన, క్రూరమైన ఘటన. ఇంటి ఆవరణలో తల్లిపక్కన నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి.. దారుణంగా టార్చర్ చేశాడా కీచకుడు. పాప పెదాలతోపాటు ఇతర చోట్ల కూడా గాయాలున్నాయి. తనతోపాటే నిద్రిస్తున్న తన చిన్నారి కనిపించని విషయాన్ని కాసేపటికి గుర్తించిన తల్లి వెతుకుతూ ఉండగానే ఈ షాకింగ్ న్యూస్ తెలిసింది. దగ్గర్లోని రోడ్డుపై పాపను గుర్తించిన కొందరు తల్లికి సమాచారం ఇచ్చారు. కామాంధుడి చేతుల్లో తీవ్రంగా నలిగిపోయిన ఆ చిన్నారికి ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ అరాచకంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు ఎవరో కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఊళ్లోకి కొత్తవాళ్లు ఎవరైనా వచ్చారా లేక ఇక్కడివాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారా అనేది నిర్థారించుకునేందుకు అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. అత్యంత నీచంగా బాలికను హింసించి, అత్యాచారానికి పాల్పడ్డిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story