కానిస్టేబుల్ రాసలీలలు: ఇంట్లో ఇల్లాలు.. వర్క్ ప్లేస్ లో ప్రియురాలు

కానిస్టేబుల్ రాసలీలలు: ఇంట్లో ఇల్లాలు.. వర్క్ ప్లేస్ లో ప్రియురాలు
X
పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లైంది భార్య బిడ్డలు ఉన్నారు.. అయినా మనసు మరో అమ్మాయి మీదకు మళ్లింది.

పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లైంది భార్య బిడ్డలు ఉన్నారు.. అయినా మనసు మరో అమ్మాయి మీదకు మళ్లింది. డ్యూటీ చేసే ప్లేసులో ఒక రూము అద్దెకు తీసుకుని ఆమెతో గడుపుతున్నాడు. ఈ విషయం కట్టుకున్న ఇల్లాలికి తెలిసింది. అగ్గిమీద గుగ్గిలం అయింది. రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన కట్టి శ్రీను ఇదివరకు కానిస్టేబుల్ గా పని చేసి ప్రస్తుతం ఎస్ టీఎఫ్ లో కొనసాగుతున్నాడు. అతడికి భార్య దివ్య, ఒక బిడ్డ ఉన్నారు. కుటుంబం నాదెండ్లలో నివాసం ఉంటోంది. కోర్టు పనుల మీద వచ్చిన సమయంలో శ్రీనుకు దాచేపల్లికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ఎస్సై పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు గుంటూరులో ఉంటోంది.

ఆమెతో పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి అమరావతి రోడ్డు ఐడీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. ఆమెతో ఉంటూ భార్యా బిడ్డలను పట్టించుకోవడం మానేశాడు శ్రీను. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో దివ్యకు అనుమానం వచ్చింది.. ఆరా తీసింది. అతడు వేరే అమ్మాయితో రాసలీలలు నడుపుతున్నాడని తెలుసుకుంది. ఈ విషయమై భర్తను నిలదీసింది, యువతిని సైతం హెచ్చరించింది. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసింది. అయినా అతడు ఆమె దగ్గరకు వెళ్లడం మానలేదు. దీంతో దివ్య వారు ఉంటున్న అపార్ట్ మెంట్ కు వెళ్లి బయటకు రావాలని కేకలు వేసింది. శ్రీను తలుపులు తీయలేదు.

దీంతో నల్లపాడు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి శ్రీనును, యువతిని బయటకు రప్పించి స్టేషన్ కు తీసుకు వెళ్లారు. కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Tags

Next Story