యువతిపై జిమ్‌ట్రైనర్ లైంగిక దాడి

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు జిమ్ ట్రైనర్. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిపై లైంగిక దాడి చేశాడు. పెళ్లి చేసుకోమని ప్రశ్నించడంతో మొహం చాటేశాడు. ఈ ఘటన టోలి చౌకిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..టోలిచౌకిలో గత కొన్నేండ్లుగా జిమ్ నడిపిస్తున్నాడు ఆసిమ్ (25) అనే యువకుడు. దీంతో ఏడాది క్రితం అదే ప్రాంతంలో నివాసముంటున్న యువతి జిమ్ లో చేరింది.
ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్న ఆసీమ్ ప్రేమ పేరుతో వెంటపడేవాడు. చివరకు ప్రేమించానని నమ్మించి సదరు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి మాట ఎత్తగానే దాట వేస్తున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతనిపై ఫిలింనగర్ పోలీసులు ఐపీసీ 376, 417,420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com