ఏడేళ్లుగా కన్నకూతురిపై తండ్రి..
నాన్నా వాడు నన్ను వేధిస్తున్నాడు అని ఆ ఆడబిడ్డ ఎవరితో చెప్పుకుంటుంది. నాన్నే నయవంచకుడై వేధిస్తుంటే.. నోరు మూసుకుంది. నాన్న వేధిస్తున్నాడని నలుగురికి కాదు కదా కన్న తల్లికి కూడా చెప్పుకోలేకపోయింది.
హర్యానాలోని హిసార్‌కు చెందిన ఒక వ్యక్తి తన 17 ఏళ్ల కుమార్తెపై ఏడు సంవత్సరాలుగా అత్యాచారాని పాల్పడుతున్నాడు. అనంతరం గర్భస్రావం చేయించుకోమంటూ బలవంతం చేసేవాడు. దీంతో ఆ బాధ భరించలేని ఆమె పోలీసులను ఆశ్రయించింది. తండ్రి నుంచి తనకు రక్షణ కల్పించమని వేడుకుంటోంది.
11 సంవత్సరాల వయస్సున వ్యక్తి తన చిన్న కుమార్తెపై కూడా అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారి ఇంట్తో కుక్‌గా పనిచేస్తున్న తన తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల ఫిర్యాదులో బాధితురాలు తన తండ్రి తనను ప్రతిఘటించినట్లయితే చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. పోలీసుల ఫిర్యాదు ప్రకారం, బాధితురాలిపై ఆమె తండ్రి అనేకసార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. అంతేకాకుండా, తన తండ్రి తన 11 ఏళ్ల సోదరిని పలు సందర్భాల్లో వేధించాడని బాధితురాలు ఆరోపించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com