ఫేస్‌బుక్ ప్రేమ.. ఆమె ప్రేమించట్లేదని అతడు..

ఫేస్‌బుక్ ప్రేమ.. ఆమె ప్రేమించట్లేదని అతడు..
ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం. ఆమె తనని ప్రేమించట్లేదని మనస్థాపం చెంది అర్థాంతరంగా తనువు చాలించాడు.

ఎంత చదువుకున్నా యువత ఆలోచనల్లో మార్పు రావడంలేదు.. ప్రేమ, పెళ్లి ఇదొక్కటే జీవితాశయం అనుకుంటున్నారు. సిటీలో సాప్ట్‌వేర్ కోర్సులు చేస్తున్నాడు.. ఆన్‌లైన్ వ్యాపారం చేస్తూ అమ్మానాన్న మీద ఆధారపడకుండా తన బ్రతుకేదో తాను బతుకుతున్నాడు. ఇంతలో ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం. ఆమె తనని ప్రేమించట్లేదని మనస్థాపం చెంది అర్థాంతరంగా తనువు చాలించాడు.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం, కె.పి. పాలెంకు చెందిన జి. సుధాకర్ (30) హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లోని బీకేగూడలో మిత్రుడితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అమీర్‌పేటలో సాప్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటూ ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నాడు.

ఏడాది క్రితం ఫేసు‌బుక్‌లో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. కానీ అతడి ప్రేమను ఆమె నిరాకరించింది. దాంతో సుధాకర్ తీవ్ర మనస్థాపం చెందాడు. శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతడు తీసుకున్న సెల్ఫీలో.. నిన్ను ప్రాణంగా ప్రేమించాను. కానీ నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. నా ప్రేమను నమ్మట్లేదు.. నా చావుతోనైనా నాది నిజమైన ప్రేమ అని తెలుసుకుంటావు అని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story