Crime News: బైక్ మీద లిప్ట్ ఇచ్చిన పాపానికి.. ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు..

Crime News: బైక్ మీద లిప్ట్ ఇచ్చిన పాపానికి.. ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు..
Crime News: ఎవరు ఎలాంటి వాళ్లో అర్థంకాకుండా ఉంది. అన్యాయంగా ఓ మనిషి ప్రాణం తీయడానికి ఏమాత్రం వెనుకాడ్డం లేదు.. లిప్ట్ అడిగితే ఇచ్చినందుకు ఇంజక్షన్ ఇచ్చి ప్రాణం తీశాడు.

Crime News: ఎవరు ఎలాంటి వాళ్లో అర్థంకాకుండా ఉంది. అన్యాయంగా ఓ మనిషి ప్రాణం తీయడానికి ఏమాత్రం వెనుకాడ్డం లేదు.. లిప్ట్ అడిగితే ఇచ్చినందుకు ఇంజక్షన్ ఇచ్చి ప్రాణం తీశాడు.. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో చోటు చేసుకుంది.

చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (40) తన చిన్న కుమార్తెను ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం భార్య కుమార్తె వద్ద ఉండడంతో ఆమెను తీసుకు వచ్చేందుకు జమాల్ బైక్ మీద వెళుతున్నాడు. ఇంతలో మార్గ మధ్యంలో ఓ వ్యక్తి లిప్ట్ అడిగాడు.. దాంతో అతడిని వాహనంపై ఎక్కించుకుని తీసుకువెళుతున్నాడు.

కొంతదూరం వెళ్లగానే వెనుక కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి జమాల్‌కు ఇంజక్షన్ ఇచ్చాడు. విషయం అర్థంకాక జమాల్ వెంటనే బైక్ ఆపాడు. దాంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని జమాల్ తన భార్యకు ఫోన్‌లో తెలిపాడు. అనంతరం అతడు స్పృహ కోల్పోవడంతో అటుగా వచ్చిన వాహనదారులు 108లో ఆస్పత్రికి తరలించారు.

కానీ దారిలోనే జమాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో ఇంజక్షన్, సిరంజి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ముదిగొండ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story