Himachal Pradesh Road Accident: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు

సిమ్లాలోని జుబ్బల్‌లో హిమాచల్ రోడ్డు రవాణా బస్సు లోయలోకి పడిపోవడంతో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలు అయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని జుబ్బల్ వద్ద రోహ్రు డిపోకు చెందిన హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) బస్సు గిల్తారీ రోడ్డులో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
జుబ్బల్‌లోని కెంచి ప్రాంతంలో సిమ్లా జిల్లాలోని రోహ్రు ప్రాంతంలోని కుద్దు-దిల్తారీకి వెళుతున్న బస్సు పర్వత రహదారిపై నుండి దిగువ లోయలో పడడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు, డ్రైవర్, ఆపరేటర్‌తో సహా మొత్తం ఏడుగురు ఉన్నారని ఎస్‌డిఎం జుబ్బల్ రాజీవ్ నమ్రాన్ తెలిపారు. రోడ్డుపై బస్సు బోల్తా పడటంతో ఉదయం 6:45 గంటలకు ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని రోహ్రులోని స్థానిక ఆసుపత్రిలో చేర్చామని రోహన్ చంద్ ఠాకూర్, మేనేజింగ్ డైరెక్టర్, HRTC అన్నారు.
ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ మరియు కండక్టర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారని ANI నివేదించింది.
మృతులు నేపాల్ నివాసి కరమ్ దాస్ (డ్రైవర్), రాకేష్ కుమార్ (కండక్టర్), బిర్మా దేవి మరియు ధన్ షాగా గుర్తించారు. గాయపడిన వారిని జియేందర్ రంగ్తా, దీపిక, హస్త్ బహదూర్‌లుగా గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com