Kalicharan Maharaj : హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్ట్...!
Kalicharan Maharaj : మహాత్మాగాంధీని అవమానించి, నాథూరామ్ గాడ్సేను ప్రశంసించిన మహారాష్ట్రకు చెందిన హిందూమత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌ను మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఆయనను రాయ్‌పుర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ కోసం ఆయనని చత్తీస్ ఘడ్ పంపించనున్నారు. సాయంత్రంలోగా అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.
గత ఆదివారం రాయ్‌పుర్‌లోని రావణ్ భాగా మైదానంలో జరిగిన ధర్మ సన్సద్‌లో కాళీచరణ్ ప్రసంగిస్తూ జాతిపిత మహాత్మాగాంధీ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నాథూరామ్ గాడ్సేను ప్రశంసించారు. మతాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ప్రభుత్వాధినేతగా బలమైన హిందూ నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు దూమారం లేపడంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్లు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com