భార్యను బస్టాప్‌లో దించి.. సారీ ఐ లవ్యూ అంటూ..

భార్యను బస్టాప్‌లో దించి.. సారీ ఐ లవ్యూ అంటూ..
సారీ ఐ లవ్ యూ.. నువ్వెంత కష్టపడతావో నాకు తెలుసు

చేసిన అప్పులు తీర్చలేనంటూ బాధల్ని, బాధ్యతల్ని భార్య మీద వదిలేసి తనువు చాలించాడు. గుంటూరు జిల్లాకు చెందిన హోంగార్డ్ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి అమరారెడ్డి నగర్‌లో హోంగార్డ్ రాజేష్ కుటుంబం నివసిస్తోంది. భార్య దుర్గా భవానీని విజయవాడ పంపిస్తూ పిల్లల గురించి జాగ్రత్తలు చెప్పాడు. ఆమెను పాత టోల్‌గేట్ వద్ద వదిలి ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆమెకు ఎందుకో భర్త తీరుపై అనుమానం వచ్చింది.. విజయవాడ బస్ వచ్చినా ఎక్కకుండా వెనుదిరిగి ఇంటికి వెళ్లింది. కానీ అంతలోనే భర్త ఇంట్లో ఫ్యానుకు వేళాతుడూ కనిపించాడు. భర్తను ఆ స్థితిలో చూసిన భార్య బోరున విలపిస్తూ చుట్టు పక్కల వారిని పిలిచింది.. రాజేష్‌ను దించి ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. అప్పటికే రాజేష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులకు రాజేష్ రాసిన సూసైడ్ నోట్ దొరికింది.

సారీ ఐ లవ్ యూ.. నువ్వెంత కష్టపడతావో నాకు తెలుసు.. లక్కీవాళ్లు జాగ్రత్త. తాకట్టు పెట్టిన బంగారం ఫలానా చోట ఉందనే వివరాలు లేఖలో రాశాడు. దీపావళి రోజు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడంతో అప్పటి నుంచి ఆయన తీరుపై అనుమానంగా ఉందని, ఇలా ప్రాణాలు తీసుకుంటారని అనుకోలేదని భార్య కన్నీరు మున్నీరవుతోంది. చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story