Uttar Pradesh: ఎన్‌కౌంటర్‌లో మరణించిన కొడుకు.. డెడ్‌బాడీని కూడా చూడనన్న తల్లి

Uttar Pradesh: ఎన్‌కౌంటర్‌లో మరణించిన కొడుకు.. డెడ్‌బాడీని కూడా చూడనన్న తల్లి
Uttar Pradesh: "చెడ్డ పని చేసే వారందరూ ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. నా దృష్టిలో యుపి పోలీసులు) ఏ తప్పు చేయలేదు.

Uttar Pradesh: "చెడ్డ పని చేసే వారందరూ ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. నా దృష్టిలో యుపి పోలీసులు) ఏ తప్పు చేయలేదు. మీరు ఇంకెవరినైనా చంపితే అది తప్పు. కానీ నా కొడుకు చెడ్డ పని చేసాడు. అందుకే వాడిని ఎన్‌కౌంటర్ చేసి చంపడం కరెక్టే అని గులాం తల్లి ఖుష్నుదా అన్నారు. తననే కాదు.. తన చుట్టుపక్కల వారిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టాడు. అతడి వల్ల ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. ఎదిగిన కొడుకుని చూసుకుని ఎంతో మురిసిపోవాల్సిన తల్లి హృదయం ఇంత కఠినంగా మారిందంటే అతడు చేసింది మామూలు పని కాదు.. కన్నతల్లి కూడా హర్షించలేని పని.. అందుకే అతడిని ఎన్‌కౌంటర్ చేసి చంపేసినా చలించలేదు. గుండెను రాయి చేసుకుని కన్న ప్రేమను చంపుకుని కొడుకు శవాన్ని చూడడానికి కూడా ఇష్టం లేదని చెప్పింది.

ఏప్రిల్ 14, 2023న, ఏప్రిల్ 13న ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన తన కొడుకు మహమ్మద్ గులాం తల్లి ఖుష్నుదా ఎన్‌కౌంటర్‌పై తన స్పందనను తెలియజేసింది. తాను, తన కుటుంబం ఎన్‌కౌంటర్‌ను తప్పుపట్టలేమని, శవాన్ని చూడాలని కూడా అనుకోవట్లేదని ఆమె అన్నారు. కానీ అతని భార్య దానిని అంగీకరించవచ్చు. ఆమె అతని మృతదేహాన్ని తీసుకువస్తే, మేము ఆమెను తప్పుపట్టలేము. ఆమె ఇంకా మాట్లాడుతూ, “అతను మాఫియా కోసం పనిచేశాడని మాకు తెలియదు. అతను అందరికీ మంచి అబ్బాయి. కానీ గత రెండు, మూడు నెలల నుంచి ఎవరో అతన్ని వెంట తీసుకెళ్లి తప్పుదారి పట్టించారు.

మహ్మద్ గులామ్ కార్యకలాపాల గురించి కుటుంబ సభ్యులకు తెలుసా అని అడిగినప్పుడు, ఆమె ఇలా చెప్పింది, “మేము ఎప్పుడూ మా ఇళ్ల నుండి బయటకు వెళ్లి ప్రజలతో మాట్లాడలేదు. మేము మా తలుపు దగ్గర నిలబడి ప్రజలతో మాట్లాడాము. మొన్న మీడియా వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము మా ఇంటి నుండి మాత్రమే మాట్లాడాము. కానీ ఎవరో అతన్ని ఈ కార్యకలాపాల్లోకి లాగి తప్పుదారి పట్టించారని ఖచ్చితంగా చెప్పగలను. అతని జీవితంతో ఆటలాడుకున్నారు. ఈ ఉదంతంతో మా జీవితం ఇప్పటికే నాశనం అయింది. మహమ్మద్ గులాం సోదరుడు రహీల్, “ప్రభుత్వం తీసుకున్న ఎన్‌కౌంటర్ చర్య సరైనదే. ఎవరైనా ఇలాంటి పని చేస్తే, మీరు అతనికి ఎలా మద్దతు ఇస్తారు అని అన్నారు.

ప్రయాగ్‌రాజ్‌కు చెందిన న్యాయవాది ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో నిందితులుగా ఉన్న అసద్‌, గులామ్‌‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. గ్యాంగ్‌స్టర్‌ అసద్‌ అహ్మద్‌తో కలిసి గులామ్‌ పనిచేసేవాడు. అసద్‌, గులామ్‌లపై రూ.5 లక్షలు చొప్పున రివార్డు ఉంది. మరోవైపు ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో అతీక్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు పడడంతో ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైల్లో ఉన్నాడు. గురువారం అతీక్‌ను, అతడి సోదరుడు అష్రఫ్‌ను ఓ కేసు విచారణ నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టుకు తీసుకువచ్చారు. వారు న్యాయస్థానంలో ఉండగానే అసద్‌ ఎన్‌కౌంటర్‌ విషయం తెలిసింది. కుమారుడిని తల్చుకొని అతీక్‌ విలపిస్తూ.. ‘నా బిడ్డ చావుకు నేనే కారణం’ అంటూ కన్నీరుపెట్టుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story