కుమార్తెతో సహా భార్యాభర్తలు బావిలో దూకి..

తాము కొన్న స్థలం చూసేందుకు కుమారుడు, కుమార్తెతో కలిసి వెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న బావిలోకి దూకి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో భార్యభర్తలు, కుమార్తె మరణించగా, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
విజయనగరం జిల్లా కొత్త వలస మండలం చింతల పాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఎండి. మొహినుద్దీన్ (46) కుటుంబంతో కలిసి విశాఖ నగరం మర్రిపాలెంలో నివసిస్తున్నారు. సోమవారం సాయింత్రం భార్య సంషినిషా (39), కుమార్తె ఫాతిమా జహీదా (17), కుమారుడు అలీతో కలిసి కొత్త వలస సమీపంలోని చింతపాలెంలో ఉన్న తమ స్థలం చూసేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న వ్యవసాయ బావిలోకి నలుగురు దూకి ప్రాణాలు తీసుకుందామనుకున్నారు.
ఈ ఘటనలో మొహినుద్దీన్, అతడి భార్య, కుమార్తె చనిపోగా, కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. కొత్త వలస పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనే విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com