Crime News: భర్త వివాహేతర సంబంధం.. ప్రశ్నించిన భార్యను..

Crime News: ఏం పొయ్యేకాలం.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఇంకోతి కావల్సి వచ్చిందా.. సిగ్గు లేదూ.. అని భార్య.. భర్త రాచకార్యాన్ని ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.. ఇంటికి నిప్పంటించాడు. ఘజియాబాద్‌కు చెందిన 40 ఏళ్ల సురేష్ భార్య రీతూ (36)తో గొడవపడ్డాడు. భర్త మరొకామెతో కలిసి ఉంటున్నాడని తెలిసి భార్య అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆవేశంతో వంటగదిలోకి వెళ్లిన సురేష్ గ్యాస్ సిలిండర్ పైపు తీసి ఇంటికి నిప్పంటించాడు. గదిలో గ్యాస్ వ్యాపించడం ప్రారంభించిన తర్వాత, రీతు సహాయం కోసం కేకలు వేయడంతో ఇతర కుటుంబ సభ్యులు గ్యాస్ రెగ్యులేటర్‌ను ఆపివేయడానికి పరుగెత్తారు. ఈ ఘటనలో సురేష్, అతని కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో సహా కనీసం 10 మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని ఢిల్లీలోని GTB ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్తను వదిలి ఒంటరిగా ఉంటున్న మరో మహిళతో సురేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com