Crime News: అనుమానంతో భార్యను చంపిన భర్త.. తండాలో ఉద్రిక్తత

Crime News: మహబూబాబాద్ జిల్లా ఆనకట్ట తండాలో ఉద్రిక్తత నెలకొంది. భార్యను అనుమానంతో చంపిన భర్త బానోతు రవీందర్‌ను శిక్షించాలంటూ గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. నిందితుడు బానోత్ రవీందర్ ఇంటికి నిప్పంటించారు. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. నిందితుడు టీఆర్ఎస్ ఉపసర్పంచ్ అని.. బాధిత కుటుంబానికి న్యాయం జరగదని గ్రామస్తులు అనుమానం
వ్యక్తం చేశారు. రవీందర్‌ను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరిపెడ మండలంలో వివాహిత హత్య కలకలం రేపింది. బానోత్ రవీందర్... తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. మమతను రవీందర్ అనుమానిస్తుండడంతో.. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
క్రమంలో తెల్లవారుజామున మరోసారి ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఆగ్రహంతో భార్యను గొడ్డలితో నరికి చంపి పారిపోయాడు రవీందర్. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా తండావాసులు అడ్డుకున్నారు. పోలీసులు చెదరగొట్టడంతో ఆనకట్ట తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com